కాజీపేటలో రూ.908 కోట్ల మెగా వ్యాగన్ వర్క్‌షాప్

కాజీపేటలో రూ.908 కోట్ల మెగా వ్యాగన్ వర్క్‌షాప్

HNK: కాజీపేట జంక్షన్ సమీపంలో నష్కల్–ఘన్‌పూర్ మధ్య రూ.908 కోట్లతో మెగా రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 300 ఎకరాల్లో విస్తరించే ఈ యూనిట్ 2026 మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఆర్‌ఓహెచ్, పీఓహెచ్, సిక్లెన్ సదుపాయాలు ఒకేచోట ఉండే ఈ ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.