జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పెట్రోల్ సంక్షోభం
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్లే వారు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.