మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
NLG: మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణంలో గల BRS పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు ఇంచార్జ్ MA రుక్సానా-ఆలీం దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసి 200 మంది అనుచరులతో ఆదివారం BRS పార్టీలో చేరారు. సిద్ధార్థ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.