ఆర్టీసీ బస్సుల్లో కనిపించని ప్రథమ చికిత్స పెట్టెలు

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని ప్రథమ చికిత్స పెట్టెలు

NGKL: అచ్చంపేటలోని ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడే ప్రథమ చికిత్స పెట్టెల్లో మందులు ఉండటం లేదు. కొన్ని బస్సుల్లో అయితే ఆ పెట్టెలే కనిపించడం లేదు. ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరేందుకు వీలుగా, తక్షణమే ప్రథమ చికిత్స పెట్టెలను మందులతో సిద్ధం చేయాలని కోరుతున్నారు.