'వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి'

'వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి'

MBNR: జడ్చర్ల సమీపంలోని దేవుని గుట్ట తండాలో నాగుపాము ఉందన్న సమాచారం అందుకున్న ప్రొఫెసర్ సదాశివయ్య సంఘటన స్థలానికి చేరుకొని పామును బంధించారు. పాము ఆరడుగుల పొడవు సుమారు 10 నుండి 15 సంవత్సరాల వయసు ఉంటుందని ఆడ నాగ పాము అని తెలిపారు. ఇంత పెద్ద పాము జనవాసాల్లోకి రావడం అరుదైన విషయమని అన్నారు . వర్షాకాలం సందర్భంగా పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.