అరకొర రోడ్డు పనులతో.. స్థానికుల అవస్థలు

PPM: వీరఘట్టం మండలంలో విక్రంపురం CSP రహదారి నుంచి కంబర గ్రామానికి వేసిన రోడ్డు పనులు అరకొరగా చేపట్టడంతో జనం అవస్థలు పడుతున్నారు. CSP రోడ్డుకు కొత్తగా వేసిన రోడ్డును అనుసంధానం చేయకపోవడంతో మధ్యలో గుంత ఏర్పడి, వర్షం కురిస్తే నీరునిల్వ ఉండిపోతుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి ఈ గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.