CMRF చెక్కుల పంపిణీ
NLR: కందుకూరు టీడీపీ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ. 41.22 లక్షల CMRF చెక్కులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు చేయించుకున్న పేదలకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు.