దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి పటేల్: CBN
AP: సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని అన్నారు. ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.