'అక్రమంగా వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటాం'
గుంటూరులో అనధికార హోల్ సేల్ కూరగాయల వ్యాపారానికి అనుమతులు లేవని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అక్రమంగా వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం నందివెలుగు రోడ్ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అనధికారిక కూరగాయల హోల్ సేల్ విక్రయాలను కమిషనర్ అడ్డుకొని పలు సూచనలు చేశారు.