కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
MHBD: దంతాలపల్లి, తూర్పు తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.