ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా గోలా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఒకే రోజులో జరిగిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒక మహిళ గాయపడింది. మృతుల్లో ఇద్దరు ఇటుక బట్టీ కార్మికులు కాగా, మరొకరు అడవిలో మహువా పూలు సేకరిస్తుండగా ఏనుగుల దాడికి గురయ్యారు. అటవీ శాఖ తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. 25 వేలు ప్రకటించింది.