మహిళతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

మహిళతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని పేరకలపూడికి చెందిన వివాహిత మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బుధవారం జరిగింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు, బాపట్లకు చెందిన తాతా రాజేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరవి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.