ఇంటర్ సిటీలో రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం

ఇంటర్ సిటీలో రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం

మహబూబాబాద్: కేసముద్రం ఇంటి కన్నె వద్ద శనివారం రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న12705 ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వందేభారత్ రైలు కేసముద్రం స్టేషన్‌లో నిలిచిపోయింది. సిబ్బంది రైలు ఇంజన్ మరమ్మతుల చేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.