VIDEO: ఒకే బంతికి బౌల్డ్, నో బాల్, సిక్స్
CSK vs RCB మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అన్షుల్ కంబోజ్ వేసిన అద్భుతమైన బంతికి RCB బ్యాటర్ టిమ్ డేవిడ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. వికెట్ పడటంతో బౌలర్ సంబరాల్లో మునిగిపోగా, అంపైర్ అనూహ్యంగా దానిని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్‌ను డేవిడ్ భారీ సిక్సర్‌తో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.