రక్షకులకే రక్షణ కరువు..!

JGL: ప్రజలకు రక్షణ కల్పించే రక్షకుల(పోలీసుల)కే రక్షణ కరువైంది. విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై కొందరు మందుబాబులు దాడికి పాల్పడిన సంఘటన కోరుట్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని తాళ్ళచెరువు ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అల్లర్లు చేస్తున్నారని తెలిపారు.