పథకాలు చంద్రబాబు స్వలాభం కోసమే: అంబటి
GNTR: కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న P4పై మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం ఇటువంటి పథకాలను ప్రవేశ పెడుతున్నారని, ఈ అంశంలో మంత్రి నారా లోకేశ్ ఉత్సాహంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు ఏ మాత్రం అంతుచిక్కడం లేదన్నారు. గుంటూరులోని సిద్దార్థ గార్డెన్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అంబటి మాట్లాడారు.