ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని  వృద్ధుడు మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని ఆసుపత్రి శవాగారంలో భద్రపరచినట్లు పోలీస్ అవుట్‌పోస్ట్ ఏఎస్సై తెలిపారు. అయితే మృతుడి బంధువులు వెంటనే ఆసుపత్రి పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.