VIDEO: ప్రమాదవశాత్తు అడవి పంది మృతి

NZB: నందిపేట్ మండలం కుద్వాన్పూర్ శివారులో గల సోలార్ ప్లాంట్ వద్ద అడవి పంది ప్రమాదవశత్తు మృతి చెందినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ తెలిపారు. ప్లాంట్ చుట్టూ అమర్చిన కంచెను దాటుతుండగా కంచెకు అమర్చబడిన ఇనుప తీగలు అడవి పంది మెడకు బిగించుకొని రక్తస్రావంతో పాటు విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిందని స్థానికులు తెలిపారు.