రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

ADB: భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.