గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో 2026-27 ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్. సరిత గురువారం తెలిపారు. పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థినులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.