జిల్లా స్థాయి పోటీల్లో తర్లుపాడు విద్యార్థిని సత్తా

జిల్లా స్థాయి పోటీల్లో తర్లుపాడు విద్యార్థిని సత్తా

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని మీర్జపేట ప్రాథమిక పాఠశాలకు చెందిన కేతబోయిన అనంతలక్ష్మి జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో తృతీయ బహుమతి సాధించింది. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది. ఈ విజయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.