ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతతో రైతుల ఆందోళన

ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతతో రైతుల ఆందోళన

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వెంటాడుతోంది. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండలో రైతులు యూరియా కోసం సొసైటీల ముందు బారులు తీరుతున్నారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు గుంపులుగా చేరి, యూరియా కోసం అధికారులతో వాగ్వాదం చేస్తున్నారు. ఈ కొరత రైతుల ఆందోళనకు కారణమవుతోంది.