VIDEO: జాతరలో సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో ఇవాళ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సందడి చేశారు. పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవ పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతరలో తిరుగుతూ తిను బాండారులు కొనుగోలు చేశారు. గాజులు కొనుగోలు చేయడమే కాకుండా జాతరలో ఏర్పాటు చేసిన పలు ఆటలను ఆడారు.