నేటి నుంచి 'పది' పరీక్షలు..!

నేటి నుంచి 'పది' పరీక్షలు..!

NLG: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకుగాను 180 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.