స్వాతంత్య్ర సమరయోధురాలు కన్నుమూత

స్వాతంత్య్ర సమరయోధురాలు కన్నుమూత

SRPT: మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు బహుదొడ్డి స్వరాజ్యం శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భర్త కూడా స్వాతంత్య్ర సమరయోధులు. ఇరువురు మునగాల పరగణాలో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆమె మృతి పట్ల మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు సంతాపం తెలిపారు.