సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
ADB: సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్నూర్ ఎస్సై అఖిల్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలిస్ స్టేషనులో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసులు ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటారని, అత్యవసర సమయాల్లో డయల్ 100ను సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమ సరఫరాలు, ఇతర నేరాల సమాచారాన్ని తెలపాలన్నారు.