గిరిజాతి లేగదూడకు విజయవంతమైన శస్త్రచికిత్స

గిరిజాతి లేగదూడకు విజయవంతమైన శస్త్రచికిత్స

కృష్ణా: గూడూరు మండలంలోని తరకటూరు గ్రామ సౌభాగ్య గోశాలకు చెందిన గిరిజాతి లేగదూడకు గూడూరు వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యాధికారి డాక్టర్ మీర్ అల్తాఫ్ హుస్సేన్ విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. గోశాలలో గిరిజాతి గోవు లేగదూడకు జన్మనిచ్చిన సమయంలో, అప్పుడే పుట్టిన లేగదూడపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.