'ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి'

HNK: వికలాంగుల పెన్షన్ పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని MSP జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్ దారులకు రూ.4వేలు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.