రహదారి ఇలా.. ప్రయాణికులు వెళ్లేదెలా..?
WGL: నర్సంపేట పోలీస్ స్టేషన్ నుండి మాదన్నరావుపేటకు వెళ్లే దారిలో పరిస్థితి ఇది. ఈ రహదారిలో ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఈ గుంతలలోకి నీరు చేరి రోడ్డు అద్వానంగా మారింది. దీంతో ఈ రహదారి గుండా వెళ్ళేందుకు వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుంతలో చేరిన నీరు ఎటూ వెళ్లడం లేదని స్థానికులు వాపోతున్నారు.