ఈనెల 4 నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు
MNCL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చేకుర్తి సరోజన సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 1800 మంది క్రీడా కారులు, 200 మంది PETలు, పీడీలు పాల్గొంటారన్నారు. క్రీడా కారులకు భోజన వసతి కూడా కల్పిస్తున్నామని తెలిపారు.