అమరావతికి వెళ్లిన కలెక్టర్

అమరావతికి వెళ్లిన కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.