ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ సబ్ జైలు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.