పంచాయతీ ఎన్నికలకు.. జిల్లా అధ్యక్షుడికి సవాలు..!
BHPL: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు రాబోయే పంచాయతీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారనున్నాయి. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత లుకలుకలు, వర్గపోరు నేపథ్యంలో అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించడం ఆయనకు కత్తిమీద సాములా తయారైంది. సీనియర్ నాయకులతో సమన్వయం కుదుర్చుకోవడంపైనే పార్టీ విజయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.