వేసవి రాకతో HYDలో పెరిగిన నీటి ట్యాంకర్ల డిమాండ్

వేసవి రాకతో HYDలో పెరిగిన నీటి ట్యాంకర్ల డిమాండ్

HYD: వేసవి రాకతో HYDలో నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ వర్షపాతం కంటే సుమారు 30% తక్కువగా నమోదవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో అత్యధిక డిమాండ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బోడుప్పల్‌లో కూడా అవసరం పెరుగుతోంది. అల్వాల్, మల్కాజ్‌గిరి నుంచి సరఫరా పెంచి, బుకింగ్ చేసిన 24 గంటల్లోనే నీరు అందించేలా చర్యలు చేపట్టారు.