'చింతలపూడిలో పరిశ్రమను స్థాపించాలి'

ELR: చింతలపూడిలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డిని కలసి చింతలపూడి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని అన్నారు.