రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
NLG: చిట్యాల మండలంలో 45 శాతం మంది రైతులు ఇంకా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోలేదని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. ఇప్పటివరకు కేవలం 55 శాతం మందికి మాత్రమే ప్రత్యేక 'ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్' కేటాయించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, రైతులు మీ-సేవా కేంద్రాల్లో చేయించుకోవాలని కోరారు.