చివరి నిమిషంలో రైల్వే పరీక్ష రద్దు

HYD: రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టులకుగాను రెండోవిడత పరీక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో రూ.4వేలు ఖర్చు పెట్టి పరీక్ష రాయడానికి వెళ్లిన తమిళనాడు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా బుధవారం జరగాల్సిన రైల్వే అసిస్టెంట్ లోకోపైలట్ల పరీక్ష సాంకేతిక లోపంతో వాయిదా వేసినట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ ప్రకటించింది.