'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
ADB: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో పోలిస్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సైలు జీవన్ రెడ్డి, రాధిక, పోలీస్ సిబ్బంది ఉన్నారు.