నిండుకుండగా బాసర గోదావరి

నిండుకుండగా బాసర గోదావరి

NRML: బాసర సరస్వతి దేవి ఆలయం సమీపంలోని గోదావరి నది భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తోంది. స్నానపు ఘాట్లలోని మొదటి మెట్టు వరకు నీరు చేరింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నది ఘాట్‌పైనే స్నానాలు చేసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వెళ్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.