VIDEO: డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం కుమ్మరి వీధి రామాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మెగా, పవన్ అభిమానులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాములవారికి, ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మంచి పనులు చేసే వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.