'రైతులను, ప్రజలను ఆదుకోవాలి'

'రైతులను, ప్రజలను ఆదుకోవాలి'

NRML: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ కోరారు. శుక్రవారం కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన పంటలను, ఇళ్లను ఆయన సందర్శించారు. జిల్లా కలెక్టర్ గ్రామంలో పర్యటించి బాధిత, ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమెండ్ చేశారు.