'మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం'
MBNR: జిల్లా కేంద్రంలోని ఎదిర వార్డులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌ను మేయర్ మమత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వైద్య సేవల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సదుపాయాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.