రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

PDPL: కమాన్ పూర్ మండల కేంద్రంలో శనివారం రజక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జంగపల్లి కనుకయ్య, అధ్యక్షుడిగా జంగపల్లి వెంకటేశం బాధ్యతలు చేపట్టగా, ఉపాధ్యక్షుడిగా జంగపల్లి ఎల్లయ్య, కోశాధికారిగా జంగపల్లి రవిని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా సదయ్య, నాగరాజు, శంకర్, కొమురయ్య, శ్రీనివాస్, శంకర్ ఎన్నికయ్యారు.