VIDEO: భారీ వర్షానికి నీట మునిగిన వరి పంట

VIDEO: భారీ వర్షానికి నీట మునిగిన వరి పంట

కృష్ణా: కోడూరు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయి. జయపురం–లింగారెడ్డి పాలెం రహదారికి ఇరు వైపుల పొలాలు జలాశయంలా మారాయి. రత్నకోడు కింద క్యాచ్ డ్రైన్ మునిగిపోవడంతో నీరు బయటకు పోక పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.