VIDEO: కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట: MLA
KMR: కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం కళ్యాణ మండపం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండే సంఘాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.