ప్లాస్టిక్ వాడకం వద్దు.. పచ్ఛదనం ముద్దు

NDL: జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవరం ప్రకాశం మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం తగ్గించి, మొక్కలు నాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేత కర్ణ పాల్గొన్నారు.