విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
NTR: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించారు. చినకాకాని వద్ద వేగంగా వచ్చిన ఆటో, బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మంగళగిరికి చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.