చెరువులో గల్లంతైన మృతదేహం లభ్యం

చెరువులో గల్లంతైన మృతదేహం లభ్యం

కృష్ణా: బందరు మండలం చినయాదర పంట కాలువలో గల్లంతైన రాంశెట్టి సుధాకర్ (22) మృతదేహం శనివారం సాయంత్రం కొత్త వాడపాలెం 9/8 పంట కాలువ వద్ద లభ్యమైంది. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన సుధాకర్ స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన ప్రాంతం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో రెస్క్యూ టీమ్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.