'బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతి'

ADB: బోథ్ మండలంలోని పొచ్చర గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను శుక్రవారం నేరడిగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. పొచ్చర జలపాతానికి వెళ్లే పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీంతో వేల ఎకరాలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యేతో గ్రామస్తులు విన్నవించారు.