VIDEO: వేలేరుపాడులో కొనసాగుతున్న గోదావరి వరద

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి నదిలో వరద గురువారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వరద నీటిమట్టం 43.90 అడుగులకు చేరుకుంది. గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ, ఏలూరు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతమైన వేలేరుపాడులో మాత్రం వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రేపాకగొమ్ము, రుద్రంకోట గ్రామాల్లోని రహదారులపై వరద నీరు ఇంకా తగ్గలేదు.